close
Choose your channels

రామ్ ఫ్యాన్స్ నన్ను చంపొద్దండి..!: నటి చార్మీ

Saturday, February 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ ఫ్యాన్స్ నన్ను చంపొద్దండి..!: నటి చార్మీ

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షురూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూరీకి.. రామ్ అరుదైన గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు. ఆ గిఫ్ట్ చూసిన నటి చార్మి కౌర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అప్పుడు రామ్‌పై కోపగించుకున్న చార్మీ ఈసారి ఆయనపై ట్విట్టర్ వేదికగా ప్రేమ ఒలకబోసింది. సినిమా సెట్‌లో తీసిన రామ్‌‌ ఫొటోను షేర్ చేస్తూ ఆ ముద్దుగుమ్మ ఏమన్నదో మీరే చూడండి.

చార్మీ ట్వీట్ సారాంశం

"రామ్‌ కష్టపడే తత్వం ఉన్న నటుడు. నీ పాజిటివిటీ, ఎనర్జీ నాకు నచ్చింది. నీ వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రతిదీ నాకు నచ్చింది. నిన్ను ఇలా మాట్లాడినందుకు నన్ను నీ లేడీ ఫ్యాన్స్ చంపేస్తారేమో. అలా చంపకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను" అని నవ్వుతూ చార్మీ ట్వీట్ చేసింది.

నెటిజన్లు రియాక్షన్..

చార్మీ ట్వీట్‌‌కు పలువురు నెటిజన్లు, రామ్ అభిమానులు రియాక్టయ్యారు. అవును రామ్‌‌.. మల్టీ టాలెంటెడ్ ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టూ లేట్ మేడమ్.. మీరు చాలా ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్నారు అంటూ చార్మీకి కొందరు కౌంటర్లిచ్చారు. అయితే కొందరు ఈ ఫొటోను చూసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ లాస్ట్ సీన్‌‌లో మాదిరిగా సెట్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.