close
Choose your channels

‘ఆచార్య’ విడుదలను వాయిదా

Tuesday, April 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఆచార్య’ విడుదలను వాయిదా

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ఈ భారీ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది. మామూలుగానే మెగాస్టార్ సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ కూడా నటిస్తున్నాడంటే ఇక అంచనాలకు కొదువేముంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌, పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ఇప్పటికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని చిత్ర నిర్మాత‌లు ప్రకటించారు. తాజాగా దేశంలో నెల‌కొన్న కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితుల కారణంగా సినిమా విడుద‌లను వాయిదా చేస్తున్న‌ట్లు , ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే సినిమా విడుద‌ల తేదీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిస్తామ‌ని నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు.

అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఓ డేట్ అయితే వైరల్ అవుతోంది. ఈ సినిమాని చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న మేకర్స్ విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై మధ్యలోనూ విడుదల చేస్తారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. మొత్తం మీద సినిమా విడుదల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాకి మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా.. తిరు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. చిత్రంలో సోనూ సూద్‌, అజయ్‌, తనికెళ్ల భరణి, కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos