close
Choose your channels

ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు

Wednesday, June 24, 2020 • తెలుగు Comments

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్క్ దాటింది. 36 వేల 47 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 497 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల 331కు దాటింది. కాగా నేడు కరోనా కారణంగా 10మంది మృతి చెందారు. తెలంగాణలో 3 వేల శాంపిల్స్‌ను పరిశీలిస్తే 8 వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కానీ ఏపీలో ఆ స్థాయిలో కరోనా లేదని గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. కాగా నేడు కరోనాతో కర్నూలు 4, కృష్ణాలో 3, గుంటూరు 2, శ్రీకాకుళంలో ఒక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 129 మంది మరణించారు. అత్యధికంగా అనంతపురంలో 90 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 146 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Get Breaking News Alerts From IndiaGlitz