close
Choose your channels

Record Break:500 మంది కోసం కోట్లు దానం చేశారు.. సోషల్ మేసేజ్‌తో 'రికార్డ్ బ్రేక్' సినిమా

Tuesday, February 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన సినిమా ‘రికార్డ్‌ బ్రేక్‌’ అని నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన దర్శకత్వం వహించిన 'రికార్డ్ బ్రేక్' సినిమా టీజర్‌, ట్రైలర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ విడుదల చేశారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ఈ సినిమాను నిర్మించారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరని.. ఈ సినిమాలో పనిచేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌, ఫైట్‌ మాస్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వీళ్లే హీరోలు అని తెలిపారు. సాబూ వర్గీస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని కొనియాడారు. తనకున్న అనుభవంతో మంచి కథ తీసుకుని సమాజానికి ఉపయోగపడే సినిమా అందించాలనే తపనతో ఐదేళ్లు కష్టపడి ‘రికార్డ్‌ బ్రేక్‌’ తీశామని పేర్కొన్నారు. దివంగత నటుడు చలపతిరావు చివరిగా నటించిన సినిమా ఇది అన్నారు.

"చలపతిరావు గారు మొదటి రోజు నుంచి ఈ సినిమా కోసం నాతో పాటు నిలబడ్డారు. ఆయన చివరి రోజుల్లో డబ్బింగ్ చెప్పారు. అప్పుడు సినిమా చూసి బయటకు వస్తూ నాతో చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను" అన్నారు. అలాగే ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి దర్శకుడు అజయ్‌, ప్రసన్న కుమార్ కారణమని చెప్పారు. తనకున్న అనుభవంతో ఒక మంచి కథ సొసైటీకి ఉపయోగపడే కథ కావాలనుకుని ఈ సినిమా మొదలుపెట్టానని.. కొంతమంది దర్శకులు సినిమా చూసి ఈ సినిమాకు 'రికార్డ్ బ్రేక్' అంటూ కరెక్ట్ టైటిల్ పెట్టారన్నారు. తెలుగుతో సహా ఎనిమిది భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని.. అన్ని భాషల్లో అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. చివరి 45 నిమిషాలు ఎమోషనల్‌గా ఉంటుందని ఆయన వెల్లడించారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "సినిమా మీద వచ్చిన డబ్బులు చూసుకోకుండా బిజినెస్ మీద వచ్చే డబ్బును కూడా సినిమాపై పెట్టే అంతటి సినిమా ప్రేమికుడు చదలవాడ శ్రీనివాస రావు గారు. చదలవాడ శ్రీనివాసరావు గతంలో 'జీవిత ఖైదీ' చేశారు. 'మాతృదేవోభవ' హిందీ రీమేక్ 'తులసి'ని మనిషా కొయిరాలతో చేశారు. నారాయణమూర్తి గారితో 'ఏ ధర్తీ హమారీ' హిందీ సినిమా చేశారు. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి ఆయన. 'బిచ్చగాడు'ను తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడీ 'రికార్డ్ బ్రేక్'తో ఎంతో మందిని చిత్రసీమకు పరిచయం చేస్తున్నారు. సామాజిక కథాంశంతో తీసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అన్నారు.

'మాతృదేవోభవ' దర్శకుడు అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఇప్పుడు వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఇద్దరు అనాధలు దేశానికి గర్వకారణంగా ఎలా ఎదిగారు అనే కథతో ఈ సినిమా తీశాం. ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ను ఇందులో చూపిస్తున్నాం’ అని చెప్పారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పూరి, బెంగాలీ, ఒరియా ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న'రికార్డ్ బ్రేక్' సినిమా మంచి విజయం సాధించాలని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.

నటి సత్యకృష్ణ మాట్లాడుతూ 'రికార్డ్ బ్రేక్' సినిమాలో మంచి రోల్ చేశానని.. తనకు ఈ అవకాశం ఇచ్చిన చదలవాడ శ్రీనివాస రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సంస్థలో తనకు ఇది రెండో చిత్రం అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

నటీ నటులు: నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ తదితరులు

సాంకేతిక సిబ్బంది: కథ: అంజిరెడ్డి శ్రీనివాస్, సంగీతం: సాబు వర్గీస్, కూర్పు: వెలగపూడి రామారావు, ఛాయాగ్రహణం: కంతేటి శంకర్, నిర్మాణం: చదలవాడ బ్రదర్స్
నిర్మాత: చదలవాడ పద్మావతి, కథనం - దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు, పి.ఆర్.ఓ : మధు వి ఆర్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.