close
Choose your channels

బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బలు.. రాజీనామా చేసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్‌..

Saturday, February 24, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బలు.. రాజీనామా చేసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్‌..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా మరికొంతమంది కూడా కారు దిగేందుకు రెడీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు పార్టీకి రాజీనామాకు చేశారు. ఆదివారం ఉదయం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో దీపామున్షి సమక్షంలో డిప్యూటీ మేయర్ దంపతులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరితో పాటు ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకోనున్నారు.

ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు మనగాడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్లుగా పార్టీలో ఉన్నామని, ఉద్యమంలో పోరాటం చేశామని గర్తుచేశారు. అయినా కానీ ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదని వాపోయారు. కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడంతో చాలా బాధపడ్డామన్నారు. పార్టీలో కష్టపడిన పనిచేసినా గుర్తింపు లేదని కనీసం ఎమ్మెల్యే టికెట్ అడిగినా కూడా ఇవ్వలేదని.. ఎంపీ సీటు ఆశించినా అది కూడా కుదరదన్నారని తెలిపారు. ఇక కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్లినా కూడా తమను పట్టించుకోలేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బలు.. రాజీనామా చేసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్‌..

మరోవైపు మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పటీకే తీగల కృష్ణారెడ్ది పలుమార్గు రేవంత్ రెడ్డితో భేటీ అయి పార్టీలో చేరికపై చర్చించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయనకు పార్టీలోకి స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరానికి చెందిన రాజేశ్వర్ కాంగ్రెస్ కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా పేరు పొందారు. వైఎస్ హయాంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇక్కడ బలపడేందుకు సిద్ధమయ్యారు. అందుకే గ్రేటర్‌కు చెందిన కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.