close
Choose your channels

Game Changer:రామ్‌చరణ్ ‘‘ గేమ్ ఛేంజర్ ’’ ఆడియో సాంగ్ లీక్ .. షాకైన చిత్ర యూనిట్, దిల్‌రాజు యాక్షన్

Saturday, September 16, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద ఎక్కువైంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా లోకేషన్‌ ఫోటోలు, హీరో హీరోయిన్ల ఫోటోలు, టీజర్లు, ట్రైలర్లు, పాటలు, కొన్ని సీన్లు ముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు తలలు పెట్టుకుంటున్నారు. తాజాగా తమిళ దర్శక దిగ్గజం శంకర్, గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘‘గేమ్ ఛేంజర్’’కు ఇలాంటి ఇబ్బందే వచ్చింది. ఈ సినిమాలోని ‘‘జరగండి జరగండి’’ అంటూ సాగే పాట సోషల్ మీడియాలో లీకై వైరల్ అయ్యింది.

దీనిని చిత్ర నిర్మాత దిల్‌రాజు సీరియస్‌‌గా తీసుకున్నారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాటను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ పాటను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని దిల్‌రాజు కోరారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ హెచ్చరించింది. అయినప్పటికీ పాట లీక్ కావడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇకపోతే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment