Arun Vikkirala:ప్రతీ ఒక్కరికీ నచ్చేలా తీశాను.. ‘కాలింగ్ సహస్ర’పై దర్శకుడు అరుణ్ విక్కిరాలా
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..
‘కాలింగ్ సహస్ర’ అనే టైటిల్ అర్థం ఏంటి?
కాలింగ్ అనేది కంపెనీ పేరు. సహస్ర అనేది హీరోయిన్ పాత్ర పేరు. కాలింగ్ సహస్ర అనేది కథలోంచి పుట్టిందే. సినిమాకు సరిపోయే టైటిల్ అనే పెట్టాం.
సుధీర్‌ను ఇంత వరకు కమెడియన్‌గా చూశాం.. ఈ కథలో ఆయన్ని ఎలా చూడబోతోన్నాం?
కాలింగ్ సహస్ర స్టార్ట్ అయిన తరువాత పది నిమిషాలకు సుధీర్ అనే వ్యక్తిని మీరు మరిచిపోతారు. ఆయన పోషించే పాత్రలోకి వెళ్తారు. పాత్రతో కనెక్ట్ అవుతారు. ఇందులో సుధీర్ కమెడియన్‌గా ఎక్కడా కనిపించడు. ఇది ఓ ప్రయోగమే. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.
సుధీర్ కాకుండా ఇతర పాత్రలకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది?
ఈ చిత్రంలో సుధీర్‌తో పాటుగా శివ బాలాజీ గారి పాత్ర, డాలీషా కారెక్టర్‌లకు మంచి పేరు వస్తుంది. డాలీషా ఓ ఫైట్ సీక్వెన్స్ చేసింది. ఫైట్ మాస్టర్ చూసి క్లాప్స్ కొట్టేశాడు.
ముందుగా ఈ కథను ఎవరికి చెప్పారు? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
గూఢచారి టైంలో అడివి శేష్ గారికి ఈ కథను చెప్పాను. ఆయన చేయాల్సిన ఈ సినిమా మిస్ అయింది. నేను ఎన్నో యాడ్స్ చేశాను. కరోనా టైంలో పోలీసులకు ఎన్నో డాక్యుమెంటరీస్ చేశాను. త్రీ మంకీస్ సినిమాకు రైటర్‌గా పని చేశాను. త్రీ మంకీస్ కంటే ముందే ఈ కథను సుధీర్ గారికి చెప్పాను. నాకు ఎందుకు ఈ కథ చెబుతున్నారు.. నేను సెట్ అవుతానా? అని సుధీర్ గారు చాలా ఆలోచించారు. త్రీ మంకీస్ టైంలో మేం ఇంకా క్లోజ్ అయ్యా. ఆ తరువాత ఈ కథ స్టార్ట్ చేశాం.
‘కాలింగ్ సహస్ర’ నిర్మాతలు ఎలా సహకరించారు?
నిర్మాతలు ఎంతో సహకరించారు. వారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. డిసెంబర్ 1న వస్తున్నామంటే దానికి కారణం కూడా వారే. యానిమల్‌తో పోటీగా రావడం లేదు.. యానిమల్‌తో పాటుగా వస్తున్నాం.
‘కాలింగ్ సహస్ర’లో టర్న్స్ అండ్ ట్విస్టులు ఎలా ఉంటాయి?
ఈ చిత్రంలో చాలా ట్విస్టులుంటాయి. ఆ ట్విస్టులు అందరికీ తెలిసినా కూడా థియేటర్‌కు వచ్చి చూస్తారు. ఇందులో మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. ఇందులో నేరుగా సందేశం ఇవ్వం. కానీ అంతర్లీనంగా ఓ మెసెజ్ ఉంటుంది.
‘కాలింగ్ సహస్ర’లో సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది?
పాటలు మోహిత్ ఇచ్చారు. ఆర్ఆర్ రాబిన్ ఇచ్చారు. మోహిత్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ టైంలో రాబిన్‌ను తీసుకుని ఫినిష్ చేశాం. ప్రేక్షకుల్ని ఆర్ఆర్ వెంటాడుతూ ఉంటుంది. ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడొచ్చు. అందరికీ అర్థం అయ్యేలా తీశాను. అందరికీ నచ్చతుంది. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout