'మహర్షి' పై ఎలక్షన్ ఎఫెక్ట్ ఉంటుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి`కి ఎన్నికల ఎఫెక్ట్ ఉండబోతుందా? అంటే జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పరిస్థితులు అలాగే కనపడుతున్నాయి. `మహర్షి` ఏప్రిల్ 25న విడుదల కానుంది. అయితే అదే సమయంలో అంటే దాదాపు ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగేలా ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో మహర్షి విడుదలైతే కలెక్షన్స్‌పై ఎన్నికల ఎఫెక్ట్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను అనుకున్న తేదిలో విడుదల చేస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరి దీనిపై నిర్మాతలు అశ్వినీదత్, దిల్‌రాజు, పివిపి విడుదల విషయంలో నిర్ణయం మార్చుకుంటారో లేక అదే రోజున వస్తారో చూడాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రధారిగా కనిపించబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.