close
Choose your channels

తొలి సినిమాలు విడుద‌ల కాలేదు.. కానీ!!

Saturday, June 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తొలి సినిమాలు విడుద‌ల కాలేదు.. కానీ!!

హీరో, హీరోయిన్ వేర్వేరు సినిమాల‌తో ఏడాది డెబ్యూ ఇస్తున్నారు. వీరి సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్నాయి. అంత‌లోపే ఇద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమాలో న‌టించ‌డానికి సిద్ధ‌మైయ్యారు. ఇంత‌కు ఆ హీరో , హీరోయిన్ ఎవరో కారు. రియ‌ల్‌స్టార్ శ్రీహ‌రి త‌నయుడు మేఘాంశ్ హీరో అయితే ఆ హీరోయిన్‌ జీవిత‌, రాజ‌శేఖ‌ర్ రెండో కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్. మేఘాంశ్ హీరోగా న‌టించిన తొలి చిత్రం `రాజ్‌దూత్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే.. శివాత్మిక రాజ‌శేఖ‌ర్ తొలి చిత్రం `దొర‌సాని` కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో పి.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(సత్తిబాబు) సినిమాను నిర్మించ‌నున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటే జీవిత‌, రాజ‌శేఖ‌ర్ మొద‌టి అమ్మాయి, హీరోయిన్ శివానీ రాజ‌శేఖ‌ర్ డెబ్యూ మూవీ `2స్టేట్స్‌` చిత్రాన్ని కూడా పి.ఎల్‌.వి.స‌త్య‌నారాయణే నిర్మిస్తున్నారు. కొన్ని కార‌ణాల‌తో `2 స్టేట్స్‌` చిత్రం ఆగింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.