రజనీకాంత్‌కు కోర్టు నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న రజనీకాంత్ నేడు కోర్టు నోటీసులు అందుకున్నాడు. రెండు పరిస్థితులు అయినా ఏం చేద్దాం. ఇక అసలు విషయంలోకి వస్తే చెన్నై గిండిలోని ఆశ్రమ్ పాఠశాల స్థల వివాదం నటుడు రజనీకాంత్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తుంది. నిజానికి ఈ కేసు సంబంధంగా రజనీకాంత్ జనవరి 27న కోర్టుకు హాజరు కావాల్సింది కానీ ఆయన కోర్టుకు రాకపోవడంతో రజనీకాంత్, లతా రజనీకాంత్ సహా స్కూల్స్ జాయింట్ డైరెక్టర్‌కు సమన్స్ పంపారట. కోర్టుకు హాజరు కావడంలో రజనీకాంత్ పేరును మినహాయించాలని కోరినప్పటికీ కోర్టు మాత్రం వినలేదు. రజనీకాంత్, లత తప్పకుండా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments