close
Choose your channels

Bharatiyadu 2:‘భార‌తీయుడు 2’... నుంచి లిరికల్ సాంగ్ ‘శౌర..’ రిలీజ్

Wednesday, May 22, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

1996లో క‌మ‌ల్ మాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ భార‌తీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తోన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా బుధ‌వారం రోజున మేక‌ర్స్ ‘భారతీయుడు 2’ మూవీ నుంచి ‘శౌర..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. పాట‌లో చూపించిన కొన్ని విజువ‌ల్స్ చూస్తుంటే భార‌తీయుడు 2 అంచ‌నాల‌ను మించేలా శంక‌ర్ తెరకెక్కించార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీత సార‌థ్యంలో సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాట‌ను రితేష్ జి.రావ్‌, శ్రుతికా స‌ముద్రాల పాడారు.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

న‌టీన‌టులు: క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.