close
Choose your channels

ఆ మాటలను నేను ఒప్పుకోను : అనుష్క

Wednesday, September 30, 2020 • తెలుగు Comments

ఆ మాటలను నేను ఒప్పుకోను : అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క. అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందింది. ఈ సినిమా అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల కాబోతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా స్వీటీ అనుష్క మంగళవారం జూమ్‌ వీడియో ద్వారా మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.‘నిశ్శబ్దం’ ఒక హారర్ థ్రిల్లర్ మూవీ అని... తన పాత్రే ఒక్కటే లీడ్‌ కాదని అనుష్క పేర్కొంది. మాధవన్, షాలిని పాండే, అంజలి, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్, సుబ్బరాజు సహా అందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని వెల్లడించింది. తన ఒక్కదాని మీదే ప్రెజర్ ఉందని చెప్పనని పేర్కొంది. ఒక సినిమా 24 క్రాఫ్ట్స్ వర్క్ చేస్తేనే రూపుదిద్దుకుంటుందని వెల్లడించింది. ఒక్కరు కాదు అందరి సపోర్ట్ అవసరమని వెల్లడించింది.

అందరూ కలిసి పనిచేస్తేనే విజయం లభిస్తుందని అనుష్క వెల్లడించింది. తన ఒక్కదానిపైనే ఒత్తిడి ఉంటుందనేది కానీ, విజయానికి తానే కారణం అనే మాటలను కానీ తాను ఒప్పుకోను అని తెలిపింది. సినిమాకి కథతోపాటు డైరెక్టర్ కూడా చాలా కీలకమని అనుష్క తెలిపింది. హేమంత్ మధుకర్ చాలా బాగా డైరెక్ట్ చేశారని తెలిపింది. ఇలాంటి పాత్ర చేసినందుకు చాలా ఎక్జయిటింగ్‌గా ఫీలయ్యానని అనుష్క వెల్లడించింది. తాను చేసిన అన్ని సినిమాల కంటే ఈ చిత్రంలో చేసిన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని పేర్కొంది.

Get Breaking News Alerts From IndiaGlitz