close
Choose your channels

Pune Car Incident: పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదిరిపోయే ట్విస్టులు.. తాజా ట్విస్ట్ ఏంటంటే..?

Monday, May 27, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదిరిపోయే ట్విస్టులు.. తాజా ట్విస్ట్ ఏంటంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేలో డ్రంకన్ డ్రైవ్ కారు కేసులో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంటుంది. థ్రిల్లర్ మూవీలను మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి. మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన టీనేజేర్‌ను కాపాడటానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్‌ బయటపడింది. మైనర్‌ బ్లడ్ శాంపిల్స్‌ను వైద్యులు మార్చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సాసూన్‌ ఆస్పత్రికి చెందిన వైద్యులు అజేయ్‌ తావ్‌రే, శ్రీహరి హార్నూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్‌ విభాగం చీఫ్‌గా పనిచేస్తోన్న తావ్‌రే.. మైనర్‌ రక్త నమూనాల్లో ఎటువంటి ఆల్కహాల్‌ ఆనవాలు లేవని నివేదిక ఇచ్చారు. కానీ పోలీసుల విచారణలో మాత్రం అతడు మద్యం సేవించినట్టు తేలింది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు నిర్దారించారు. దీంతో వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు ధ్రువీకరించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల ఫోన్‌లను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తర్వాతి రోజు నిందితుడి తండ్రి వారితో ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.

పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదిరిపోయే ట్విస్టులు.. తాజా ట్విస్ట్ ఏంటంటే..?

ఈ సందర్భంగా పుణే కమిషనర్‌ అమితేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ఇదేదో మద్యం మత్తులో చేసిన ప్రమాదం కేసు ఎంత మాత్రం కాదు. నిందితుడైన టీనేజర్‌‌కు రెండు బార్లలో పార్టీ చేసుకొంటూ మద్యం సేవించిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో వాహనం నడిపితే రోడ్డుపై వెళ్లేవారి ప్రాణాలకు ప్రమాదమన్న విషయంపై అతడికి పూర్తి అవగాహన కూడా ఉంది.. ప్రమాదం జరిగిన తర్వాత నిందితుడి రక్త నమూనాలను వివిధ సందర్భాల్లో పరీక్షించడంతో కచ్చితమైన ఫలితాలు వచ్చాయి ’’ అని పేర్కొన్నారు. 'తొలుత రక్త నమూనాల్లో మద్యం సేవించిన ఆనవాళ్లు లేవని నివేదిక వచ్చింది. రెండో ఫలితంలో మాత్రం పాజిటివ్ రావడంతో అనుమానం వచ్చి డీఎన్ఐ టెస్ట్ చేయించాం. ఈ పరీక్షలో వేర్వేరు వ్యక్తుల నమూనాలు ఉన్నట్టు వెల్లడయ్యింది. అంటే మైనర్ రక్త నమూనాలను మరొక వ్యక్తితో మార్చేశారు. 'అని తెలిపారు.

కాగా గత ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అశ్విని కోస్టా, అనీశ్ అవధీయలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో బాలుడికి జువైనల్‌ జస్టిస్ట్ బోర్డు కొద్ది గంటల్లో బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కోర్టు తీర్పుపై తీవ్ర విమర్శలు రావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డ్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించాలని ఆదేశించింది. మరోవైపు ఈ కేసును తప్పుదోవ పట్టించి, మైనర్‌ను రక్షించేందుకు అతడి కుటుంబం ప్రయత్నించింది. డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించేందుకు అతడ్ని బంధించి, బెదిరించారు. దీంతో నిందితుడి తండ్రి, తాతను పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.