close
Choose your channels

పాక్‌‌కు భారత్ భారీ షాక్‌‌ .. ఈ దెబ్బతో కోలుకోలేదేమో!

Sunday, February 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పుల్వమా ఉగ్రదాడి అనంతరం పాక్‌‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని వేచి చూస్తున్న భారత్‌‌కు సువర్ణావకాశం రానే వచ్చింది. పాక్‌‌పై ప్రతీకారంగా మొదట ‘ప్రాధాన్యతా దేశం’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్-ఎంఎన్ఎఫ్) హోదాను ఉపసంహరించుకున్నట్లు భారత్ ప్రకటించింది. పొరుగుదేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 శాతం పెంచుతున్నట్లు శనివారం రోజున భారత్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో పాక్‌‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్లైంది. పాక్‌‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసేందుకు దౌత్య పరంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు భారత్ తేల్చిచెప్పింది. మరోవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్‌‌కు సపోర్ట్ చేశాయి.

కాగా.. ఎప్పట్నుంచో పాక్ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టలాడుతోంది. భారత్ తీసుకున్న తాజా నిర్ణయంతో పాక్‌‌కు మరిన్ని ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా పాక్-భారత్‌‌ల మధ్య సుమారు 200 కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోందని తెలుస్తోంది.

అసలేంటి ఎంఎఫ్ఎన్ అంటే...

ఎంఎఫ్ఎన్ అంటే మోస్ట్ ఫేవర్ నేషన్(అత్యంత ప్రాధాన్య దేశం) అని అర్థం. ఈ హోదా ఉంటే డబ్ల్యూటీవో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ) దేశాలతో వ్యాపారం చేసుకునేందుకు సులువుగా ఉంటుంది. కస్టమ్స్ ట్యాక్స్‌‌లపై రాయితీ కూడా ఉంటుంది. కాగా 1996లో పాక్‌‌కు ఎంఎఫ్ఎన్ హోదాను ఇచ్చింది. అయితే పాక్ మాత్రం భారత్‌‌కు ఆ హోదానూ ప్రకటించిన పాపాన పోలేదు. ఎంఎఫ్ఎన్ హోదా లేకుంటే.. పాక్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకం భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉన్ని, కెమికల్స్ ఉత్పత్తుల ఎగుమతులు పాక్‌‌కు నిలిచిపోతాయి. దీంతో పాక్‌‌లో పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు ఆకాశన్నంటుతాయి.

ఎగుమతులు.. దిగుమతులివే..

భారత్‌‌ ఎగుమతులు ఇవే: ఉన్ని, హెయిర్ డై, కెమికల్స్, కూరగాయలు, ఇనుము, ఉక్కు.
భారత్ దిగుమతులు ఇవే: పండ్లు, సిమెంట్, లెదర్, సుగంధ ద్రవ్యాలు

పాక్‌‌కు భారత్ ఇచ్చిన తాజా దెబ్బతో ఇప్పట్లో కోలుకోవడమే కష్టమైన పనే. భారత్ చేసిన మొదటి పనిని పలువురు ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నెటిజన్లు.. ఇవే కాదు.. ఫుడ్, వాటర్ కూడా అక్కడికెళ్లకుండా కట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ‘బహుత్ అచ్చా కామ్ కియా’ అంటూ మరికొందరు నెటిజన్లు భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే భారత్‌‌ ఇచ్చిన షాక్‌‌తో పాక్ ఎలా ముందుకెళ్తుందో..? ఏం చర్యలు తీసుకోనుందో..? వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.