close
Choose your channels

మరో 54 యాప్స్‌పై బ్యాన్ .. చైనాకు గట్టి స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్ధమైన ఇండియా

Monday, February 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండో చైనా బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డ్రాగన్‌కు షాకివ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన మరో 54 యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో బ్యూటీ కెమెరా - సెల్ఫీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, వివా వీడియో ఎడిటర్‌, టెన్సెంట్‌ రివర్‌ , యాప్‌లాక్‌, డ్యుయల్‌ స్పేస్‌ లైట్‌ తదితర 54 యాప్‌లు వున్నట్లుగా తెలుస్తోంది.

కాగా.. 2020 జూన్‌ 15న గల్వాన్‌ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. నాటి ఘటనలో ఇరు దేశాల వైపు భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంది. దీంతో భారత్- చైనాలు సరిహద్దులకు భారీగా సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని మోహరించాయి. ఈ నేపథ్యంలో యుద్ధం తప్పదని అంతా భావించారు. అయితే అంతర్జాతీయ జోక్యం, అత్యున్నత స్థాయి సైనిక చర్చలతో ముప్పు తప్పింది. అయినప్పటికీ ఏదో ఒక రకంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే వున్నాయి.

అదే సమయంలో గల్వాన్ ఘర్షణ సమయంలోనే దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే కారణాలతో 2020లో వందల సంఖ్యలో చైనా యాప్స్‌లను భారత ప్రభుత్వం నిషేధించిందింది. తొలుత జులై నెలలో 59 యాప్‌లు, సెప్టెంబరులో 118 యాప్‌లు, నవంబరులో 43 చైనా యాప్‌లను నిషేధించింది. వీటిల్లో టిక్‌టాక్‌తో పాటు విచాట్‌, షేర్‌ఇట్‌, హలో, లైకీ, యూసీ బ్రౌజర్‌, పబ్‌జీ వంటి యాప్‌లున్నాయి. దీని కారణంగా చైనా ఆర్ధిక వ్యవస్థకు భారీ నష్టం కలిగింది. దీంతో డ్రాగన్ భారత్ తీరును తప్పుబట్టింది. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా మరో 54 యాప్‌లను నిషేధించాలని ఇండియా నిర్ణయించిన నేపథ్యంలో చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.