close
Choose your channels

కారు నంబర్ ప్లేట్‌పై జగన్ పేరు.. కేసు నమోదు!

Tuesday, October 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కారు నంబర్ ప్లేట్‌పై జగన్ పేరు.. కేసు నమోదు!

రోడ్లపైకి వస్తే చాలు రకరకాల కంపెనీల కార్లు.. రంగు రంగుల వాహనాలు.. కనిపిస్తుంటాయి. కాస్త గమనిస్తే చిత్ర విచిత్రాలుగా నంబర్ ప్లేట్స్.. వెహికల్స్‌ అద్దాలపై బ్లాక్ కోట్స్ కనిపిస్తుంటాయ్. కార్లు, బైక్‌ల నంబరు ప్లేట్లపై నంబర్లకు బదులు తమకు నచ్చిన క్యాప్షన్స్, అభిమానించే నటులు, రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీల చిత్రాలను చూస్తూనే ఉంటాం.

అయితే తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాకేశ్ రెడ్డి ఓ యువకుడు తన కారుపై నంబర్‌ ప్లేట్‌లో నంబర్‌కు బదులుగా వైఎస్ జగన్ పేరు రాసుకున్నారు. జగన్ అంటే పిచ్చి అభిమానం ఈ కుర్రాడికి.. అందుకే జగన్‌ పేరు రాసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనొకటి మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. కాగా.. జీడిమెట్ల అతని నివాసం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.