close
Choose your channels

విజ‌య్ తో న‌టించ‌డం ఓ మ‌ధుర జ్ఞాప‌కం - జ‌గ‌ప‌తి

Thursday, June 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ - జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్లో రూపొందుతున్నఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని భ‌ర‌త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వెంకట్రామ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం హైద‌రాబాద్ షెడ్యూల్ ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్ర హీరో విజ‌య్, జ‌గ‌ప‌తి బాబు, ఈ చిత్ర నిర్మాత వెంక‌ట్రామ్ రెడ్డి..ఈ ముగ్గురి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. అది ఏమిటంటే...హీరో విజ‌య్ ఫాద‌ర్ ఎస్.ఎ చంద్ర‌శేఖ‌ర్, జ‌గ‌ప‌తి ఫాద‌ర్ వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్, వెంక‌ట్రామ్ రెడ్డి ఫాద‌ర్ బి.నాగారెడ్డి ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఇప్పుడు వాళ్ల త‌న‌యులు క‌లిసి సినిమా చేస్తుండ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా జ‌గ‌ప‌తి బాబు స్పందిస్తూ...విజ‌య్ ఫాద‌ర్, మా ఫాద‌ర్ క‌లిసి కొన్ని సినిమాలు నిర్మించారు.

ఇప్పుడు మేము క‌లిసి సినిమా చేస్తుండ‌డం.... హిస్ట‌రీ మ‌ళ్లీ రిపీట్ అవుతున్న‌ట్టు అనిపిస్తుంది. విజ‌య్ చాలా మంచి మ‌నిషి. అత‌నితో వ‌ర్క్ చేస్తూ..ఈ ప్రాజెక్ట్ లో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్క్ వుట్ అయి ఆడియోన్స్ కి ఒక ఫ్రెష్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ క‌లిగిస్తుంది అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో వ‌ర్క్ చేయ‌డం థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమా చేయ‌డం మా నాన్న చేసుంటే ఆయ‌న కూడా చాలా థ్రిల్ ఫీల‌య్యేవారు. విజ‌య్ తో న‌టించ‌డం ఓ మ‌ధుర జ్ఞాప‌కం అన్నారు.

జ‌గ‌ప‌తిబాబు త‌మిళ చిత్రాలు తాండ‌వం, లింగా చిత్రాల్లో న‌టించారు. ఇటీవ‌ల తెలుగులో నాన్న‌కు ప్రేమ‌తో, శ్రీమంతుడు చిత్రాల్లో న‌టించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాయో తెలిసిందే. అలాగే జ‌గ‌ప‌తి మల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ తో క‌లిసి పులిమురుగ‌న్, మ‌రియు విశాల్ తో క‌లిసి త‌మిళ్ ఫిల్మ్ చేస్తున్నారు. క‌న్న‌డ స్టార్ సుదీప్ తో క‌లిసి బ‌చ్చ‌న్ సినిమాలో న‌టించారు. ప్ర‌స్తుతం మ‌రో రెండు క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇలా సౌత్ లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌ భాష‌ల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు జ‌గ‌ప‌తి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.