close
Choose your channels

janasena : రైతుల గురించి ఆ మాటలేంటీ.. సీఎం క్షమాపణలు చెప్పాల్సిందే : జనసేన నేత మధుసూదన్ రెడ్డి

Tuesday, June 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కౌలు రైతులను అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరణించిన కౌలు రైతుల కుటుంబాలతో కలసి ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టి.సి.వరుణ్‌తో కలిసి మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి బాధల్లో ఉన్న కుటుంబాలను రూ. 7 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి... హేళనగా మాట్లాడం సబబు కాదన్నారు.

మరణించిన కౌలు రైతులకు రూ.7 లక్షలు పరిహారం చెల్లించాలి:

ముఖ్యమంత్రి జగన్ కౌలు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకపోగా వారి మరణాలను అవమానించేలా మాట్లాడటం భావ్యం కాదని హితవు పలికారు. సీఎం మాట్లాడిన తీరు చాలా హేయంగా ఉందని.. ప్రభుత్వం చేయాల్సిన పనిని పవన్ కళ్యాణ్ ఒక్కరే చేస్తున్నారని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులను గుర్తించి వారికి లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతి, జిల్లా నాయకులు ఆకుల ఉమేష్, సాకే పవన్ కుమార్, పొదిలి బాబురావు, జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.