close
Choose your channels

ఈనెల 7న జీవా - కాజల్ 'ఎంతవరకు ఈ ప్రేమ'

Wednesday, April 5, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`రంగం` ఫేం జీవా - కాజల్ అగర్వాల్ జంట‌గా తెర‌కెక్కిన‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ `కవలై వేండాం` తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` పేరుతో అనువాద‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. `యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 7న (ఏప్రిల్ 7)న రిలీజ‌వుతోంది.
ఈ సందర్భంగా....
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ `` తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వ‌స్తున్న చిత్ర‌మిది. అన్ని ప‌నులు పూర్తి చేశాం. ఈనెల 7న సినిమాని రిలీజ్ చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను త‌మిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. అక్క‌డ పెద్ద విజయం అందుకుని ఇప్పుడు తెలుగులో వ‌స్తోంది. తెలుగు ట్రైల‌ర్స్‌, పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. జీవా, కాజ‌ల్ న‌ట‌న యువ‌త‌రానికి క్రేజీగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల్ని వంద శాతం మెప్పించే చిత్ర‌మిది`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.