close
Choose your channels

Koose Munisamy Veerappan:ZEE5 తమిళ్ ఒరిజినల్ డాక్యుమెంట్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’ తెలుగు ట్రైలర్ విడుదల

Friday, November 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నవంబర్ 24, నేషనల్: పలు భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ మన దేశంలోనే అతి పెద్దదైన ఓటీటీ మాధ్యమంగా రాణిస్తోంది ZEE5. తాజాగా ఇందులో మరో కొత్త ఒరిజినల్ చేరింది. అదే తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’. ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు. ఈ క్రమంలో సదరు బందిపోటు దొంగకు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించారు. అదేవిధంగా ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నించిన అధికారుల నుంచి సేకరించిన వీడియోను కూడా పొందుపరిచారు. ఇది వీరప్పన్ యొక్క రహస్య జీవితాన్ని, అతని నేర వారసత్వాన్ని స్పష్టంగా ఆవిష్కరించింది. ఈ సిరీస్ ముందు వీరప్పన్ నెరేషన్‌తో ప్రారంభమవుతుంది. అతని పూర్తి జీవితాన్ని ఆవిష్కరిస్తూనే అతని చుట్టూ జరిగిన ఘటనలను గురించి కూడా తెలియజేస్తుంది. కూసే మునస్వామి వీరప్పన్ ఒరిజినల్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ZEE5 ఎక్స్‌క్లూజివ్‌గా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

వీరప్పన్‌ను పట్టుకోవటానికి మూడు దశాబ్దాల పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక అడవుల్లో పోలీసులు అన్వేషించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో నాటకీయంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) టీమ్ చేసిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మరణించారు. పోలీసుల రికార్డుల్లో, చరిత్రలో తన చరిత్ర ఓ భాగంగా మాత్రమే మారింది. ఇందులో వీరప్పన్ స్వయంగా నెరేషన్ ఇచ్చారు. ఇదొక తమిళ కథనం. దీంతో కూసే మునస్వామి వీరప్పన్‌పై ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన దృక్పథం ఏర్పడుతుంది.

ఈ సందర్భంగా ZEE5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘‘మా ప్రేక్షకుల కోసం ‘కూసే మునస్వామి వీరప్పన్’ ఒరిజినల్‌ను అందించటం థ్రిల్లింగ్‌గా ఉంది. ఇండియాలో పేరు పొందిన అడవి దొంగ గురించి చాలా మందికి తెలియని విషయాలను ఈ సిరీస్ అందిస్తుంది. వీరప్పన్ జీవితంలోని ఒడిదొడుకులను, అతనున్న స్థానిక గ్రామాల్లోని ప్రజలపై అతని ప్రభావం ఎలా ఉండేదనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. సాధారణంగా జీవితంలో విజయవంతమైన వ్యక్తుల కథలకు ప్రాధాన్యత దొరుకుతుంది. అయితే అయితే చీకటి మార్గాలను ఎంచుకున్న కూసే మునస్వామి వీరప్పన్ వంటి సంక్లిష్టమైన కథలకు ఈ సిరీస్ ఒక రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్ మన జీవితం గురించి వైవిధ్యంగా ఆలోచింప చేస్తుందని మేం నమ్ముతున్నాం’’ అన్నారు.

జర్నలిస్ట్ నక్కీరన్ గోపాల్ మాట్లాడుతూ ‘‘వీరప్పన్‌తో ఇంటర్వ్యూ తీసుకోవటానికి మేం చాలా కష్టపడ్డాం. తొలిసారి నేను చేసిన ఇంటర్వ్యూను పూర్తిగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో చూపించబోతున్నారు. కూసే మునస్వామి వీరప్పన్ పేరుతో జీ 5 తెరకెక్కించిన ఈ సిరీస్‌లో దాన్ని చూడొచ్చు. నిజాయతీ, పరిపూర్ణతతో వీరప్పన్ కథను చెప్పే క్రమంలో బాధితుల కథనాలను కూడా పొందుపరిచారు. దీన్ని కేవలం డాక్యుమెంటరీగానే కాకుండా ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్‌లాగా రూపొందించారు’’ అన్నారు.

నిర్మాత ప్రభావతి మాట్లాడుతూ ‘‘మన ప్రాంతీయ కథలను గ్లోబల్ రేంజ్ ప్రామాణాల్లో చెప్పటానికి ధీరన్ ప్రొడక్షన్స్‌ను స్థాపించాం. ఇప్పుడు మన ప్రేక్షకుల అంచనాలను, వారు గ్లోబల్ రేంజ్ కథలను ఆదరించే విధానం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మా బ్యానర్‌లో తొలిసారి కూసే మునస్వామి వీరప్పన్ వంటి ఒరిజనల్‌ను రూపొందించటం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తారని నమ్మకంగా ఉంది ’’ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.