close
Choose your channels

మాట నిల‌బెట్టుకున్న లారెన్స్‌

Monday, May 20, 2019 • తెలుగు Comments

మాట నిల‌బెట్టుకున్న లారెన్స్‌

కొరియోగ్రాఫ‌ర్ నుండి ద‌ర్శ‌కుడిగా ఎదిగిన రాఘ‌వ లారెన్స్ సినిమాల‌తో పాటు స‌మాజ సేవ కూడా చేస్తుంటాడు. గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డే చిన్న‌పిల్ల‌ల‌కు ఆప‌రేష‌న్‌, అనాథ పిల్ల‌ల‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌డం ఇలా చాలానే మంచి ప‌నులు చేస్తుంటారు. ఇవి కాకుండా ఇంకేవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంట‌నే స్పందిస్తుంటారు.

ఈ కోవ‌లో గ‌జ తుపానులోఇల్లు కోల్పోయిన ఓ ముస‌లి అవ్వ‌కు ఇల్లు క‌ట్టించి ఇస్తాన‌ని మాట ఇచ్చాడు. అన్న‌ట్లుగానే లారెన్స్ ఆమెకు ఇల్లు క‌ట్టించి ఇచ్చి గృహ ప్ర‌వేశం చేయించాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ముస‌లావిడ గురించి త‌న‌కు చెప్పిన వారికి ఈ సంద‌ర్భంగా లారెన్స్ కృత‌జ్ఞ‌తలు కూడా తెలిపారు. 

రీసెంట్‌గా బాలీవుడ్‌లో లారెన్స్ స్టార్ట్ చేసిన 'కాంచ‌న‌' రీమేక్ .. కొన్ని మ‌న‌స్ప‌ర్ద‌ల‌తో ఆగిపోయింది. ఇప్పుడు లారెన్స్ ఏం చేయ‌బోతారో చూడాలి. 

Get Breaking News Alerts From IndiaGlitz