close
Choose your channels

ఒక రోజు ముందే వస్తున్న లోఫర్..

Wednesday, December 9, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న దిషా ప‌టాని న‌టించింది. ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందించారు. ఇటీవ‌ల రిలీజైన లోఫ‌ర్ ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. వ‌రుణ్ తేజ్ త‌ల్లిదండ్రులుగా పాసాని, రేవ‌తి న‌టించారు. అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి త‌ర్వాత మ‌ద‌ర్ సెంటిమెంట్ తో పూరి తెర‌కెక్కించిన లోఫ‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 18న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ..తాజా స‌మాచారం ప్ర‌కారం ఒక‌రోజు ముందుగా అంటే ఈనెల 17న లోఫ‌ర్ మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..లోఫ‌ర్ పై పూరి న‌మ్మ‌కం నిజ‌మ‌వుతుందో లేదో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.