24 మూవీకి మహేష్ నో చెప్పడానికి రీజన్ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 24. ఈ చిత్రం ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్ర కథను డైరెక్టర్ విక్రమ్ కుమార్ ముందుగా మహేష్ కి చెప్పారని వార్తలు వచ్చాయి.
ఇదే విషయం గురించి...మహేష్ ని అడిగితే...విక్రమ్ కుమార్ 24 కథ నాకు చెప్పిన మాట వాస్తవమే. 24 కథ నాకు నచ్చింది. అయితే...ఆ కథతో తెర పై నన్ను నేను ఊహించకోలేకపోయాను. అందుకే 24 మూవీ చేయలేదు అని చెప్పారు. అలాగే...ఈ కథకు సూర్య అయితే బాగుంటాడు అనే సలహాలు ఏమీ ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం 24 మూవీ చేసాను. సూర్య తప్ప ఇంకెవరు చేయలేరు అనిపించింది అని 24 గురించి సూపర్ స్టార్ మహేష్ మనసులో మాటలు బయటపెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.