close
Choose your channels

వామ్మో.. నాగుపాముకే స్నానం చేయించాడు!

Wednesday, May 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టైటిల్ చూడగానే.. ఇదేంటి.. పామును చూస్తేనే వణుకుపడుతుంది అలాంటిది స్నానం చేయించడమా..? అనే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే మరి. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వీడియో చూసిన జనాలు మాత్రం తెగ షేర్ చేస్తున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. జంతువులు, అడవులకు సంబంధించిన వీడియోలను ఎక్కువ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హెడ్ బాత్‌ను ఆస్వాదించింది..

పడగ విప్పిన రాచనాగు తలపై బకెట్‌తో ఓ యువకుడు స్నానం చేయించాడు. అసలే వేసవి కాలం కావడంతో ఆ నాగు పాము కూడా ఏమీ అనకుండా స్నానాన్ని ఆస్వాదించింది. కనీసం బుసలు కూడా కొట్టకుండా హెడ్ బాత్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలా సుమారు రెండు బకెట్లు పోయగా స్నానం అవ్వగానే తిన్నగా తనదారిన వెళ్లిపోయింది. ఈ వీడియో పోస్ట్ చేసిన సుశాంత నందా.. ‘ అసలే సమ్మర్ టైమ్ కదా.. తల స్నానాన్ని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. దయచేసి ఇలా ఎవరూ దీన్ని ప్రయత్నించవద్దు.. చాలా ప్రమాదకరం’ అని వీడియోకు ఈ మాటలు జతచేశాడు. కాగా.. ఇలాంటి వీడియోలు ఈ ఐఎఫ్ఎస్ ట్విట్టర్ అకౌంట్ కోకోల్లలు ఉన్నాయ్.. టైమ్ ఉంటే మీరూ ఓ లుక్కేయండి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.