సినిమాలకు మెగా హీరోయిన్ గుడ్ బై!!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ లాగా చాలా మంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు.. మరికొందరు సక్సెస్ కావడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా హీరోలతో పాటు నాగేంద్రబాబు కుమార్తె నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఇంతవరకూ ఈమె ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ పడలేదు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తే.. ఆ సినిమానే అట్టర్ ప్లాప్ అవుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే మెగా హీరోలకు మాత్రం అచ్చొచ్చిన టాలీవుడ్.. మెగా డాటర్స్‌కు అచ్చిరాలేదన్న మాట. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని నిహారిక డిసైడ్ అయిపోయిందట. ఈ షాకింగ్ నిర్ణయాన్ని తన కుటుంబ సభ్యులతో సైతం పంచుకుందట. అయితే నాగబాబు, వరుణ్ తేజ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదట.
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిహారిక అటు సినిమాలతో.. ఇటు వెబ్ సిరీస్‌లోనూ తన అదృష్టాన్ని పరిశీలించుకుంటోంది. సినిమాల్లో సక్సెస్ కాలేకపోయిన నిహారిక.. వెబ్ సిరీస్‌లో నటించడమే కాకుండా నిర్మిస్తుండటంతో మంచి అవకాశాలు వస్తుండటంతో ఇక దీనికే పరిమితం కావాలని భావిస్తున్నదట. సో.. నిహారికకు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో.. ఫిల్మ్‌నగర్‌లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments