close
Choose your channels

మెగా హీరోతో మెహరీన్

Tuesday, December 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాబ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్ తేజ్, హీరోగా విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి డిఫ‌రెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.దిల్ రాజు నిర్మాత‌గా నూత‌న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి `ఫీల్ మై ల‌వ్` అనే సినిమా చేయ‌బోతున్నాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి.

అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ సినిమా నిర్మాణం నుండి త‌ప్పుకున్నాడ‌ని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సైలెంట్‌గా జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ స‌ర‌స‌న `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ` ఫేమ్ మెహ‌రీన్ హీరోయిన్‌గా ఫిలింన‌గ‌ర్ టాక్‌. కృష్ణ‌గాడీ వీర ప్రేమ‌గాథ త‌ర్వాత మెహ‌రీన్ ఇప్పుడు ర‌వితేజ‌, శ‌ర్వానంద్‌ల‌తో జ‌త క‌డుతుంది. ఈ సినిమా స్టార్ట్ కాక‌ముందే మెగాహీరో సినిమాలో హీరోయిన్‌గా కూడా న‌టిస్తుంద‌ని ఓర‌కంగా మెహ‌రీన్ ల‌క్కీయేన‌ని చెప్పుకోవాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.