close
Choose your channels

పంద్రాగస్టు నాడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

Thursday, August 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పంద్రాగస్టు నాడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం చేశారు. ఇదే ఎర్రకోట వేదికగా మోదీ పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. ముఖ్యంగా రక్షణశాఖకు సంబంధించి త్వరలో త్రివిధ దళాల సమన్వయం కోసం ఒక చీఫ్‌ (సీడీఎస్‌)ను నియమించబోతున్నట్లు మోదీ సంచలన ప్రకటన చేశారు. సైనిక విభాగాల మధ్య సమన్వయానం కోసం.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)గా వ్యవహరిస్తారని.. ఇదో గొప్ప నిర్ణయమని.. రాబోయే రోజుల్లో మన త్రివిధ దళాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని మోదీ చెప్పుకొచ్చారు.

అత్యవసరంగా భావించి!

దేశ రక్షణ సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చాయని.. కాబట్టి ఏదో ఒక సైనిక విభాగంపై ఆధారపడటం సరికాదన్నారు. త్రివిధ దళాలను సమన్వయ పరుచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే గతంలో ఎప్పట్నుంచో ఈ సీడీఎస్‌ ప్రతిపాదనను మోదీ సర్కార్ అత్యవసరంగా భావించి అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. త్రివిధ దళాలకు సంబంధించిన ప్రణాళికలు, శిక్షణ, బడ్జెటింగ్ ఇలా అన్ని వేరు, వేరుగా ఉంటున్నాయని.. ఇకపై సీడీఎస్ ఈ వ్యవహారాలతో పాటూ.. త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారన్న మాట.

ఆర్టికల్ 370 రద్దుపై..!

‘స్వాతంత్ర్య సమరయోధులకు, దేశం కోసం ప్రాణాలర్పించి ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతున్నాను. దేశంలో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయారు.. వరదల్లో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను. అలాగే దేశ ప్రజలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు? తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ ఆకాంక్షను నెరవేర్చాము. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందని.. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయి. 370, 35A రద్దు ద్వారా కాశ్మీర్ ప్రజలకు బహుమతి ఇచ్చాం. అక్కడ అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు దక్కాలి. లడక్‌లో శాంతి స్థాపనే మా లక్ష్యమని.. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అన్న పటేల్ కల నెరవేరింది. గత ప్రభుత్వాలను ఆర్టికల్ 370పై నిర్ణయం ఎందుకు తీసుకోలేదు?. ‘జీఎస్టీతో వన్ నేషన్.. వన్ ట్యాక్స్, వన్ నేషన్.. వన్ గ్రిడ్, వన్ నేషన్.. వన్ మొబిలిటీ కార్డ్‌‌లు సాధ్యమయ్యాయి. త్వరలోనే వన్ నేషన్.. వన్ ఎలక్షన్’కూడా అమలు చేస్తాం. ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలపై దేశంలో విస్తృతంగా చర్చ జరగాలి" అని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.

కష్టమేం కాదు..!

"మన శక్తి సామర్థ్యాలను ప్రపంచం గుర్తిస్తోంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణం మొదలు పెట్టాం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం కష్టం కాదు. దేశం పర్యాటకులకు స్వర్గధామంగా మారాలి. ప్రతి జిల్లా ఎగుమతి కేంద్రంగా తయారవ్వాలి. టెర్రరిజంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ మద్దతిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు" అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.