చైతు నెక్ట్స్ మూవీ కన్ ఫర్మ్

  • IndiaGlitz, [Saturday,February 20 2016]

అక్కినేని నాగ చైత‌న్య - గౌత‌మ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వంలో సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రం చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య న‌టిస్తున్న ప్రేమ‌మ్ రిలీజ్ కానుంది. చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న ప్రేమ‌మ్ జులైలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
ఈ రెండు సినిమాల త‌ర్వాత చైత‌న్య‌తో సినిమాలు చేయ‌డానికి క‌ళ్యాణ్ కృష్ణ‌, శ్రీవాస్, హ‌రీష్ శంక‌ర్...రెడీగా ఉన్నారు.ఏ డైరెక్ట‌ర్ తో ముందుగా సినిమా చేస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే ఈ విష‌యం పై నాగ్ క్లారిటీ ఇస్తూ...చైతు నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ తో చైత‌న్య నెక్ట్స్ మూవీ ఉంటుంది. ప్రేమ‌మ్ షూటింగ్ పూర్తి అయిన వెంట‌నే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నాం అని నాగ్ ఎనౌన్స్ చేసారు. అది సంగ‌తి.

More News

100 సెంటర్స్ లో సోగ్గాడే చిన్ని నాయనా 50 రోజులు పూర్తి చేసుకుంటుండడం చాలా సంతోషంగా ఉంది - నాగార్జున

కింగ్ నాగార్జున హీరోగా నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

రాఘవేంద్రరావు తో భక్తిరస చిత్రం చేస్తున్నట్టు ఎనౌన్స్ చేసిన నాగ్..

కింగ్ నాగార్జున -రాఘవేంద్రరావు వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య,శ్రీరామదాసు,శిరిడి సాయి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో...ఎంతటి సంచలన విజయాలు సాధించాయో తెలిసిందే.

ధనుష్ హీరోగా గౌతమ్ సినిమా...

తమిళ హీరో ధనుష్ -విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు సినిమా రాలేదు.

ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసిన బన్ని..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

మహేష్ సరసన రామ్ హీరోయిన్..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ మురుగుదాస్ మూవీ చేయనున్నారు.