close
Choose your channels

ధనుష్ హీరోగా గౌతమ్ సినిమా...

Saturday, February 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ హీరో ధ‌నుష్ - విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఇప్పటి వ‌ర‌కు సినిమా రాలేదు. త్వ‌ర‌లో వీరిద్ద‌రు క‌ల‌సి ఓ మూవీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ధ‌నుష్ ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కొడి చిత్రంలో న‌టిస్తున్నారు.
రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష రాజ‌కీయ నాయ‌కురాలి పాత్ర పోషిస్తుండ‌డం విశేషం.ధ‌నుష్ నెక్ట్స్ హాలీవుడ్ చిత్రంతో పాటు, వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రం చేయాల్సి ఉంది. అయితే వాటిని ప‌క్క‌న పెట్టి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ధనుష్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ క్రేజీ మూవీకి ఎన్నై నోక్కి పాయుమ్ తోటా అనే టైటిల్‌ను నిర్ణయించారు. మ‌రి...ధ‌నుష్ - గౌత‌మ్ మీన‌న్ ఫ‌స్ట్ టైం క‌ల‌సి చేయ‌నున్న ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.