close
Choose your channels

రాఘవేంద్రరావు తో భక్తిరస చిత్రం చేస్తున్నట్టు ఎనౌన్స్ చేసిన నాగ్..

Saturday, February 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్ నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావు వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన భ‌క్తిర‌స చిత్రాలు అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకున్నాయో...ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయో తెలిసిందే. ఈ మూడు అధ్యాత్మిక అద్భుతాలు అందించిన నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావు మ‌రో అధ్యాత్మిక అధ్బుత చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. .
ఈ సినిమా గురించి నాగ్ ని అడిగితే...ఈ చిత్రాన్ని తిరుమ‌ల‌లో ప్రారంభించి అక్క‌డ ఎనౌన్స్ చేయాల‌నుకున్నాం. అయితే అడిగారు కాబ‌ట్టి చెబుతున్నాను...ఈసారి వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడు హ‌తిరామ్ బాబా గా న‌టిస్తున్నాను. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. మే నెల‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. నాగ్ - రాఘ‌వేంద్ర‌రావుల కాంబినేష‌న్లో రూపొందనున్న‌నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం అధ్యాత్మిక అద్భుత చిత్రంగా నిలుస్తుంద‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.