close
Choose your channels

100 సెంటర్స్ లో సోగ్గాడే చిన్ని నాయనా 50 రోజులు పూర్తి చేసుకుంటుండడం చాలా సంతోషంగా ఉంది - నాగార్జున

Saturday, February 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా రిలీజై 35 రోజులు అవుతున్నా ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుంది. సంక్రాంతికి సోగ్గాడు...400 లోపు థియేట‌ర్స్ లో రిలీజై నేటికి 53 కోట్లకు పైగా షేర్ సాధించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా సోగ్గాడు సంచ‌ల‌న విజ‌యం గురించి కింగ్ నాగార్జున మాట్లాడుతూ....సోగ్గాడు చిన్ని నాయ‌నా...రియ‌ల్ స‌క్సెస్. మ‌నం అనే క్లాసిక్ ఫిల్మ్ త‌ర్వాత ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంతో తీసిన సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాలో న‌న్ను ఎక్స్ ప్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ విజ‌యంతో మ‌ళ్లీ కొత్త క్యారెక్ట‌ర్ తో సినిమా చేయ‌చ్చు..అలాగే కొత్త డైరెక్ట‌ర్స్ ని ప్రొత్స‌హించవ‌చ్చు అనే ధైర్యం వ‌చ్చింది.
ఇది చిన్న స‌క్సెస్ కాదు బిగ్ సక్సెస్. సంక్రాంతికి థియేట‌ర్స్ దొర‌క‌క‌పోవ‌డం వ‌ల‌న 400 క‌న్నా త‌క్కువ థియేట‌ర్స్ లో రిలీజ్ చేసాం. పండ‌గ‌కి ఎంత కలెక్ట్ చేసిందో పండ‌గ త‌ర్వాత కూడా అంత క‌లెక్ట్ చేయ‌డం...35 రోజులు అవుతున్న ఇంకా షేర్ వ‌స్తుండ‌డంతో ఈ సినిమా ఏ రేంజ్ స‌క్సెస్ సాధించిందో తెలుస్తుంది. నా ముప్పై మూడేళ్ల కెరీర్ లో...ఈ టైమ్ లో ఈరేంజ్ స‌క్సెస్ రావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఊపిరి సినిమా చూసాను. చాలా బాగా వ‌చ్చింది. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది.
అప్ప‌ట్లో శివ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. శివ క‌లెక్ష‌న్స్ ఇప్ప‌టితో పోలిస్తే...ఎన్ని కోట్లు క‌లెక్ట్ చేసింద‌ని చెప్పాలి. అలాగే మాయాబ‌జార్, అడ‌విరాముడు, ప్రేమాభిషేకం...ఈ చిత్రాలు నేటి క‌లెక్ష‌న్స్ తో పోలిస్తే కొన్ని వంద‌ల కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్టు అవుతుంది. అందుచేత క‌లెక్ష‌న్స్...రికార్డ్స్...గురించి నేను ప‌ట్టించుకోను. అయినా సోగ్గాడు చిన్ని నాయ‌నా 53 కోట్లు పైగా షేర్ సాధించింది అనేది విన‌డానికి చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.