close
Choose your channels

నాన్నకు ప్రేమతో..ఆడియో రిలీజ్ వాయిదా..

Wednesday, December 16, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పెయిన్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న నాన్న‌కు ప్రేమ‌తో ....టీమ్ షూటింగ్ పూర్తి చేసుకుని రెండు రోజుల్లో హైద‌రాబాద్ రానున్నారు. ఈ నెల 25న నాన్న‌కు ప్రేమ‌తో...ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. అయితే హఠాత్తుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ తండ్రి సత్య‌మూర్తి చ‌నిపోవ‌డంతో...నాన్న‌కు ప్రేమ‌తో...ఆడియో రిలీజ్ డౌట్ లో ప‌డింది. ఈ సినిమా కోసం దేవిశ్రీప్ర‌సాద్ ఇంకా ఒక సాంగ్ కంపోజ్ చేసి ఇవ్వాలి. ఇటువంటి ప‌రిస్థితుల్లో నాన్న‌కు ప్రేమ‌తో...ఆడియో రిలీజ్ ప్లాన్ చేసినట్టుగా ఈ నెల 25న రిలీజ్ అవుతుందా..? లేదా..? అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.