close
Choose your channels

'బన్నీ' బావకు ప్రేమతో నవదీప్ మరిచిపోలేని గిఫ్ట్

Saturday, June 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘బన్నీ’ బావకు ప్రేమతో నవదీప్ మరిచిపోలేని గిఫ్ట్

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నటుడు నవదీప్‌లు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరి స్నేహం ‘ఆర్య-2’ సినిమాతో మరింత బలపడింది. అంతేకాదు.. బన్నీని నవదీప్ బావ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇలా పిలుచుకునే దాకా వచ్చిందంటే వీరిద్దరి మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమ స్నేహానికి గుర్తుగా.. లైఫ్‌లాంగ్ గుర్తుండిపోయేలా అల్లు అర్జున్‌ బావకు గిఫ్ట్‌ ఇవ్వాలని భావించిన నవదీప్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన అల్లువారబ్బాయి తన ఫేస్‌బుక్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

బావకు ప్రేమతో..

‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ గోనగన్నారెడ్డి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆ లుక్‌ నచ్చిన నవదీప్‌‌.. సేమ్ టూ సేమ్‌ అదే లుక్‌తో ఓ చిన్న విగ్రహాన్ని తయారుచేయించాడు. ఈ విషయాన్ని బన్నీ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఈ విగ్రహాన్ని త్వరలోనే బన్నీకి ఇవ్వనున్నట్టు నవదీప్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. బావకి ప్రేమతో చిరు కానుక అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ చేసిన బన్నీ.. ఫేస్‌బుక్‌లో రియాక్ట్ అయ్యారు.

బన్నీ పోస్ట్ సారాంశం ఇదీ..

" ఔ.. గోనకన్నారెడ్డి.. గోనకన్నారెడ్డి.. నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇదీ.. థ్యాంక్యూ బావ నవదీప్.. " అని బన్నీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చేసిన నవదీప్, బన్నీ అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓహ్ స్వీట్ గిఫ్ట్ బాస్.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.