close
Choose your channels

నిహారిక వివాహం : రేర్ ఫోటోను షేర్ చేసిన చిరు..

Tuesday, December 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిహారిక వివాహం : రేర్ ఫోటోను షేర్ చేసిన చిరు..

మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల వివాహం మరికొన్ని గంటల్లో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు. కాగా.. ఇప్పటికే ఇరువైపులా పెళ్లి పెద్దలతో పాటు అతిథులంతా వివాహ వేదిక అయిన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. సోమవారం రాత్రి సంగీత్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తొమ్మిది గంటలకు మొదలై... అర్ధరాత్రి వరకూ జరిగినట్టు సమాచారం. ఇక హల్దీ ఫంక్షన్‌ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది.

మెహందీ వేడుక.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు జరగనుంది. ఫైనల్‌గా నిహారిక వివాహం.. బుధవారం రాత్రి 7.15 గంటలకు జరగనుంది. కాగా.. సంగీత్ కార్యక్రమంలో వధూవరులు నిహారిక, చైతన్య.. చిరంజీవి సినిమాలో పాటలకు డాన్స్‌ చేసి అలరించారు. రెండు, మూడు రోజుల నుంచి నిహారిక పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక నుంచి ఇప్పటి వరకూ జరుగుతున్న కార్యక్రమాలన్నింటికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

నిన్న నాగబాబు తన కూతురి వివాహ విషయమై చేసిన ట్వీట్‌లో చాలా భావోద్వేగానికి గురయ్యారు. నేడు మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి నిహారికతో ఉన్న ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేశారు. తమ చేతుల్లో పెరిగిన చిన్నారి నిహారిక వివాహ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. "మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు. గాడ్‌ బ్లెస్‌ యు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.