close
Choose your channels

సందీప్ తో నిత్యా మీన‌న్

Thursday, November 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్నేహ‌గీతం, వెంక‌టాద్రి ఎక్సె ప్రెస్...త‌దిత‌ర చిత్రాల‌తో అల‌రించిన యంగ్ హీరో సందీప్ కిష‌న్ . తాజాగా సందీప్ ఒక అమ్మాయి త‌ప్ప అనే సినిమా చేస్తున్నాడు. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్, ర‌వి కిష‌న్ ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ కాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో సందీప్ స‌ర‌స‌న నిత్యా మీన‌న్ ను ఫైన‌ల్ చేసార‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే ఈ ప్రాజెక్ట్ కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.