close
Choose your channels

YSRCP:సీమలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయం.. పార్టీ నేతల్లో ధీమా..

Wednesday, April 10, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల విజయావకాశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మూడు నెలల క్రితం వరకు వైయస్ఆర్‌సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీ అని ప్రచారం జరిగింది. ఎప్పుడైతే సీఎం వైయస్ జగన్ 'సిద్ధం' సభలతో నాలుగు ప్రాంతాలను కవర్ చేశారో పరిస్థితులన్నీ ఆ పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. దీనికి తోడు 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టి ఇప్పటికే రాయలసీమ, నెల్లూరు జిల్లాలను చుట్టేశారు. రాయలసీమలో జగన్ అడుగుపెట్టిన ప్రతి చోటా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

తొలి నుంచి రాయలసీమ అంటే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014, 2019లలో కూడా తన హవా కొనసాగించింది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో 30 సీట్లు గెలిస్తే.. 2019లో ఏకంగా 52 అసెంబ్లీ సీట్లకు 49 గెలుచుకుని ఔరా అనిపించింది. ఈసారి కూడా అదే ఊపు కొనసాగించాలని సీఎం జగన్ పట్టదలతో ముందుకు సాగుతున్నారు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఈసారి కూడా 40కి పైగా సీట్లు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడులో నిర్వహించిన 'సిద్ధం' సభకు లక్షలాది మంది జనం తరలివచ్చి తమ మద్దతును తెలియజేశారు.

గతంలో ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులను చేర్చుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ జగన్ బస్సు యాత్ర సాగుతోంది. నెల్లూరు జిల్లాలోనూ కొంత మంది నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండదని భావిస్తున్నారు. ఈసారి కూడా నెల్లూరులో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. రాయసీమ జిల్లాల్లో జగన్ యాత్రకు వచ్చిన ప్రజాధరణ చూసిన వైయస్ఆర్‌సీపీ నాయకులు 2019 నాటి సీన్ మళ్లీ రిపీట్ అవడం పక్కా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా రాయలసీమలో ఈసారి కూడా ప్రతిపక్షాలకు ఘోర పరాభవం తప్పదని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ఒకటి లేదా రెండు సీట్లు కూడా రావడం కష్టమంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు వైసీపీ నేతలు. గత రెండు సంవత్సరాల నుంచే కుప్పంలో గెలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేసుకుంటూ వస్తున్నారు. కుప్పంలో గెలిచే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. దీంతో ఆయనే ఎక్కువగా అక్కడే ఉంటూ బాబు ఓటమికి ప్రణాళికలు రచిస్తున్నారు. చంద్రబాబును ఓడించి రాయలసీమలో క్లీన్ స్వీప్ చేస్తామనే నమ్మకంతో ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.