close
Choose your channels

Rahul Gandhi: సొంత కారు, ఇల్లు లేదు.. రాహుల్ గాంధీ ఆఫిడవిట్‌లో ఆసక్తికర వివరాలు..

Thursday, April 4, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Rahul Gandhi: సొంత కారు, ఇల్లు లేదు.. రాహుల్ గాంధీ ఆఫిడవిట్‌లో ఆసక్తికర వివరాలు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అఫిడవిట్‌లో పేర్కొన్న ఆయన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లుగా పేర్కొన్నారు. అయితే సొంత వాహనం, ఫ్లాట్ లేవని పేర్కొనడం గమనార్హం. ఇక ఈ రూ.20 కోట్లలో చరాస్తులు రూ.9.24 కోట్లుగా ఉన్నాయన్నారు. ఇందులో రూ.55వేల నగదు, రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్‌లు, బాండ్‌లు, షేర్‌ల విలువ రూ.4.33 కోట్లు, మ్యూచ్యువల్ ఫండ్స్ విలువ రూ.3.81 కోట్లు, రూ.15.21 లక్షల విలువైన గోల్డ్ బాండ్స్‌, రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నట్లు ప్రస్తావించారు.

అలాగే స్థిరాస్తుల విలువ రూ.11.15 కోట్లుగా ఉంది. ఇందులో ఢిల్లీలోని మెహరౌలీలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కలిసి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇక గుడ్‌గావ్‌లో సొంతగా ఆఫీస్‌ ఉందని ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.9 కోట్లుగా ఉందన్నారు. అయితే వారసత్వంగా ఈ భూమి తమకు వచ్చినట్టు వివరించారు. వీటితోపాటు తనపై నమోదైన పోలీస్ కేసుల గురించి కూడా ఆఫిడవిట్‌లో వెల్లడించారు.

Rahul Gandhi: సొంత కారు, ఇల్లు లేదు.. రాహుల్ గాంధీ ఆఫిడవిట్‌లో ఆసక్తికర వివరాలు..

గతంలో సోషల్ మీడియాలో అత్యాచార బాధితారులి కుటుంబ సభ్యుల వివరాలు బయట పెట్టినందుకు తన పోక్సో కేసు నమోదైందన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు FIR కాపీ సీల్డ్‌ కవర్‌లో ఉంచారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చారా లేదా అన్నది తెలియదన్నారు. అంతేకాకుండా బీజేపీ నేతలు తనపై వేసిన పరువు నష్టం దావా కేసులు పెట్టారని కూడా పేర్కొన్నారు.

కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీచేసి విజయం సాధించిన రాహుల్.. ఇప్పుడు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 4.10లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. తాజాగా రాహుల్‌పై పోటీగా సీపీఐ నేత రాజా, కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ బరిలోకి దిగారు. దీంతో ఇక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న కేరళలోని 20 నియోజకవర్గాలకు పోలింగ్ జరనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.