close
Choose your channels

పనిలేని పులిరాజు సాంగ్ లీకైంది..

Tuesday, May 31, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటించిన‌ చిత్రం పనిలేని పులిరాజు. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు చాచా. ఈ చిత్రం ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ మూడోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పాటలు హైలైట్ గా వుంటాయి. ఆడియోను జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నాం అని సహ నిర్మాత రవి.కె.పున్నం ఇటీవ‌ల తెలియ‌చేసారు.
ఇదిలా ఉంటే...ప‌నిలేని పులిరాజు ఆడియో ఇంకా రిలీజ్ కాలేదు. ఇంత‌లో సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో ప‌నిలేని పులిరాజు సాంగ్ అంటూ ఓ సాంగ్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఆడియో రిలీజ్ చేయ‌కుండా సాంగ్ ఎలా లీకైందో అర్ధం కావ‌డం లేదంటున్నారు చిత్ర‌యూనిట్. వి.వి. సంగీతం అందించిన ప‌నిలేని పులిరాజు ఆడియోను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోల సాంగ్స్ లీక‌వ్వ‌డం కామ‌న్...కానీ..ధ‌న‌రాజ్ సినిమా సాంగ్ లీక‌వ్వ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.