close
Choose your channels

'పనిలేని పులిరాజు' పాటలు విడుదల

Sunday, June 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం పనిలేని పులిరాజు`. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై చాచా దర్శకత్వంలో పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.వి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలు నేరుగా మార్కట్లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ...

నిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడుతూ ` మా పనిలేని పులిరాజు చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. శనివారం సినిమా పాటలను మార్కెట్లోకి డైరెక్ట్ విడుదల చేశాం. తప్పకుండా పాటలు అందరికీ నచ్చుతాయి. సినిమాను జూన్ మూడోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పాటలు సినిమాలో హైలైట్ గా వుంటాయి`` అని అన్నారు.

సహ నిర్మాత రవి.కె.పున్నం మాట్లాడుతూ `ప్రస్తుతం మోషన్ పోస్టర్ విత్ డైలాగ్స్ కు మంచి ఆదరణ వచ్చింది. శనివారం మార్కెట్లోకి పాటలు విడుదల చేశాం. రఘుబాబు కామెడీ, నటన సినిమాలో కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమాను జూన్ మూడో వారంలో విడుదల చేస్తాం`` అన్నారు.

దర్శకుడు చాచా మాట్లాడుతూ ధనరాజ్ నటన సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. వివి మంచి సంగీతాన్ని ఇచ్చారు. సినిమాలో హాస్యమే ప్రధానంగా వుంటుంది.` అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.