close
Choose your channels

Vaishnav Tej:పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ ప్రచారం

Wednesday, May 1, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు పవన్‌ను ఓడించాలని అధికార వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఆర్థిక, అంగ బలంతో పవన్‌కు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకే జనసేనాని కూడా ఈసారి వారి కుట్రలను ఛేదించి గెలవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో స్థానిక టీడీపీ, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఓవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన పృథ్వీరాజ్, హైపర్ ఆది, గెటప్ శీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వాళ్లు కూడా పవన్ తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల బాబాయ్ గెలుపు కోసం అబ్బాయ్ వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగారు. గత శనివారం నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారం చేయనున్నారు. నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో వైష్ణవ్‌ తేజ్‌ పర్యటించనున్నారని కూటమి నేతలు తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం నవఖండ్రవాడ నుంచి వైష్ణవ్‌ తేజ్‌ రోడ్డుషో ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తపల్లి మండలం కొండెవరం, ఇసుకపల్లి మీదుగా నాగులాపల్లి, రమణక్కపేట, రామరాఘవపురం, ముమ్మిడివారిపోడులో పవన్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తదుపరి శ్రీరాంపురం నుంచి కోనపాపపేట, శీలంవారిపాలెం మీదుగా మూలపేట సెజ్‌ కాలనీ చేరుకుంటారు. అక్కడ నుంచి మూలపేట సెంటర్‌లో ప్రసంగిస్తారు. ఇక రామన్నపాలెం, అమీనాబాద్‌ సెంటర్‌ నుంచి యండపల్లి ఎస్సీ పేట, యండపల్లి జంక్షన్‌, కొత్తపల్లి మీదుగా ఉప్పాడ బీచ్‌రోడ్‌ సెంటర్‌ వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారని రాజకీయ, సినీ వర్గాల్లోనూ వినబడుతోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ ఈసారి పవన్ గెలుపు కోసం ప్రచార బరిలోకి దిగడంపై అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో తమ నాయకుడు జనసేనాని గెలవడం ఖాయమని జనసైనికులు ధీమాతో ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.