close
Choose your channels

అది వైసీపీకి దేవుడిచ్చిన వరం.. నేతలు కళ్లు తెరవాలి: పవన్

Friday, July 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అది వైసీపీకి దేవుడిచ్చిన వరం.. నేతలు కళ్లు తెరవాలి: పవన్

ఏపీ ప్రభుత్వ పని తీరుతో పాటు పలు విషయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయన చాలా రోజుల తర్వాత నేరుగా మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పని తీరు గురించి పవన్ మాట్లాడుతూ.. ‘‘151 సీట్లొచ్చాయి. బలమైన పార్టీగా ఉంది. ఇది వైసీపీకి భగవంతుడిచ్చిన వరం. దీనిని సద్వినియోగం చేసుకోవడం లేదుమోనని నా అభిప్రాయం. ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. హైకోర్టులో 60 కేసులకు పైగా వ్యతిరేక తీర్పు రావడంతో నైనా తమ తప్పులున్నాయని గ్రహించాలి. ఇవన్నీ సరిచేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు స్థిరమైన జీవన విధానం ఇవ్వాలి’’. అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ సంస్థ చెబుతోంది. పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి ప్రభుత్వం ప్రజలను సంతోష పెట్టే పనిలో ఉంది. ఇది ఎంతవరకూ సమంజసం అనే దానిపై పవన్ మాట్లాడుతూ.. ‘‘మనం సంపాదించే దానికంటే అప్పులు ఎక్కువగా ఉంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఓ తండ్రి అప్పులు చేసి పిల్లల్ని పెంచుతుంటే.. అప్పుడు ఆ పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.. చివరకు అది కట్టలేక తండ్రి చేతులెత్తేస్తే అది పిల్లలపైనే భారం పడుతుంది.

ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి కానీ అప్పులు పెంచే మార్గాలు వెతికి దాన్ని అభివృద్ధి అంటే దానికి మనం ఏం చేయలేం. దీనివల్ల ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు ఏమీ కాదు కానీ.. రాబోయే భావి తరాలపై భారం పడుతుంది. దీంతో ప్రజలు అణగారిపోయి ఉంటారు. వాళ్లను నడిపే రాజకీయ వ్యవస్థ మాత్రం చాలా బాగుంటుంది. అప్పులు తెచ్చి ప్రజలకిచ్చే దానిని కచ్చితంగా అభివృద్ధి అనలేం. వైసీపీ నేతలు కళ్లు తెరిచి అభివృద్ధి పథం వైపు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని పవన్ పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.