'బిగ్బాస్3' పై హెకోర్టులో్ పిటిషన్
Send us your feedback to audioarticles@vaarta.com
రియాలిటీ షో `బిగ్బాస్3`ను ఆపేయాలంటూ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. ఇప్పటికే రెండు సీజన్స్ ముగిశాయి. త్వరలోనే మూడో సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలో ఇలాంటి పిటిషన్, నిర్వాహకులకు సమస్యే. మరి ఈ పిటిషన్ వేసింది తెలుగు బిగ్ బాస్ 3 కోసం కాదు.. తమిళ బిగ్బాస్ కో్సం. సదన్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
షోలో పాల్గొనే సభ్యులు అశ్లీలంగా డ్రెస్సులు వేసుకోవడం ద్వంద అర్థాలతో మాట్లాడటం వంటి నేటి యువతకు సరిపోతుందేమో కానీ.. తల్లిదండ్రులకు సంకోచాన్ని రేపుతుంది. కాబట్టి ప్రోగ్రామ్ను సెన్సార్ బోర్డుతో సెన్సార్ చేయించి ప్రసారం చేయాలంటూ పిటిషనర్ పేర్కొన్నారు. మరి నిర్వాహకులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.