close
Choose your channels

చరిత్ర సృష్టించిన మోడీ : యూఎస్ కాంగ్రెస్ ఆహ్వానం .. చర్చిల్, మండేలా తర్వాత ఆ ఘనత

Saturday, June 3, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చరిత్ర సృష్టించిన మోడీ : యూఎస్ కాంగ్రెస్ ఆహ్వానం .. చర్చిల్, మండేలా తర్వాత ఆ ఘనత

అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకోవడమే కాకుండా ఆయా దేశాలతో భారతదేశానికి కూడా సంబంధాలు మెరుగుపరుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గడిచిన 9 ఏళ్ల కాలంలో భారత దౌత్య విధానం పూర్తిగా మారిపోయింది. అనేక దేశాలు ఇండియాతో స్నేహ సంబంధాల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీకి అరుదైన ఘనత దక్కింది. ఈ నెల 22న యూఎస్ కాంగ్రెస్ (భారత్‌లో పార్లమెంట్ వంటిది) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ప్రధానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ మెక్ కార్తీ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ఇరుదేశాల మధ్య మెరుగైన సంబంధాల కోసం అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణతో పాటు భారత్, అమెరికాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రసంగించనున్నారు.

జూన్ 22న అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి మిమ్మల్ని ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖఫై యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ మెక్ కార్తీ, సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షూమర్, సెనేట్ రిపబ్లికన్ నేత మెక్ కానెల్, ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్ నేత హకీమ్ జెఫ్రీస్ సంతకాలు చేశారు.

యూఎస్ కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న మోడీ:

2016లో యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించిన ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోడీ. తద్వారా దిగ్గజ నేతలు బ్రిటీష్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా తర్వాత రెండు పర్యాయాలు అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించిన ప్రసంగించిన నేతగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు. 2016 నాటి తన ప్రసంగంలో వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, రక్షణ, భద్రతా వ్యవహారాలు, వాణిజ్యం తదితర అంశాలపై ప్రధాని మోడీ ప్రసంగించారు.

చరిత్ర సృష్టించిన మోడీ : యూఎస్ కాంగ్రెస్ ఆహ్వానం .. చర్చిల్, మండేలా తర్వాత ఆ ఘనత

మోడీ పర్యటనలో ఫైటర్ జెట్ ఇంజిన్‌ల డీల్‌పై స్పష్టత :

ఇకపోతే.. ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రధాని అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జూన్ 22న వైట్‌హౌస్‌లో మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు. ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే పర్యటనలో భారత్ అమెరికాల మధ్య ఫైటర్ జెట్ ఇంజిన్‌పై మెగా డీల్ కుదరనుంది. అదే జరిగితే ప్రపంచంలో ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారుచేసే దేశంగా భారత్ నిలవనుంది.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.