close
Choose your channels

ప్ర‌శాంత్ నీల్ టాలీవుడ్ మూవీ..హీరో ఎవ‌రంటే?

Tuesday, June 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌శాంత్ నీల్ టాలీవుడ్ మూవీ..హీరో ఎవ‌రంటే?

`కె.జి.య‌ఫ్‌`తో క‌న్న‌డ చిత్రసీమ‌కు సెన్సేష‌న్ హిట్ అందించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. ఈ చిత్రంలో య‌ష్ హీరోగా న‌టించాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పార్ట్ ఇప్పుడు షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ ద‌ర్శ‌కుడు త‌దుప‌రి చిత్రాన్ని తెలుగులో చేస్తాడ‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే నేడు ప్ర‌శాంత్‌నీల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యంపై కాస్త క్లారిటీ వ‌చ్చింది.

అదెలాగంటే ప్ర‌శాంత్ నీల్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా తెలుగులో ప్ర‌స్తుతం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థల్లో ఒక‌టైన మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌శాంత్ నీల్‌కు అభినంద‌నల‌ను `మా ద‌ర్శ‌కుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు` అంటూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. అంటే ప్ర‌శాంత్ నీల్‌తో సినిమా చేయ‌బోయే నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేక‌ర్స్ అనే విష‌యంపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లే. మ‌రి ఈ సినిమాలో మ‌హేష్, ప్ర‌భాస్, రాంచ‌ర‌ణ్‌ల‌లో ఎవ‌రు హీరోగా న‌టిస్తార‌నేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.