close
Choose your channels

‘ఆచార్య‌’ కోసం భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే

Thursday, January 28, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఆచార్య‌’ కోసం భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంటోంది. రామ్‌చ‌ర‌ణ్‌పై స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. కాగా.. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డేను తీసుకోవ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. పూజా హెగ్డే ‘ఆచార్య‌’లో న‌టించ‌డానికి ఆస‌క్తిగా ఉన్నా కూడా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం భారీగానే డిమాండ్ చేస్తుంద‌ట‌. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు ఇర‌వై నిమిషాల పాత్ర కోసం పూజా హెగ్డే కోటిన్న‌ర రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అడుగుతుంద‌ట‌. చిన్న పాత్ర కోసం అంత మొత్తం డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ క్రేజ్ దృష్ట్యా ద‌ర్శ‌క నిర్మాత‌లు పూజా హెగ్డే వైపుకే మొగ్గుచూపుతున్నార‌ని స‌మాచారం.

‘ఆచార్య‌’ కోసం భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే

ఇందులో చిరంజీవి మాజీ నక్స‌లైట్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. కాగా.. రామ్‌చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే న‌క్స‌లైట్ నాయ‌కుడు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. మ‌రి ఆ పాత్ర‌ను కొర‌టాల శివ ఎలా ఎలివేట్ చేస్తాడోన‌నేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం. దేవాదాయ‌శాఖ‌లోని అవినీతిని ప్ర‌శ్నించేలా కొర‌టాల శివ ‘ఆచార్య‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. హైద‌రాబాద్ శివారు ప్రాంత‌మైన కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో ఈ సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మే 7న ఈ సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.