close
Choose your channels

Anil Sunkara:ఏజెంట్ డిజాస్టర్‌.. బాధ్యత మాదే, ఈసారి తప్పు జరగదు : నిర్మాత అనిల్ సుంకర రియాక్షన్

Monday, May 1, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని కుటుంబంలో మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అఖిల్‌కు మాత్రం సరైన హిట్ దక్కడం లేదు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు విజయం సాధించినప్పటికీ.. చెప్పుకోగదగ్గ స్థాయిలో కమర్షియల్ హిట్ మాత్రం అఖిల్‌ ఖాతాలో పడలేదు. అయితే రెండేళ్లు ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘‘ఏజెంట్’’ మూవీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకోవడంతో అఖిల్‌తో పాటు అక్కినేని అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అసలు సినిమా ఫ్లాప్ కావడంతో కృంగిపోయి వున్న దశలో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. దీనికి అఖిల్ తల్లి, సినీ నటి అమల ఘాటుగా బదులిచ్చారు. అయినప్పటికీ దీనికి చెక్ పడటం లేదు.

అందరికీ క్షమాపణలు :

ఈ నేపథ్యంలో ఏజెంట్ సినిమా నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. మూవీ ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యతని తామే తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏజెంట్ విషయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని విజయాన్ని అందుకోవాలని అనుకున్నామని.. కానీ సినిమా షూటింగ్‌కు బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్లలేదని, దీని వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్ధితి ఏర్పడిందని సుంకర అభిప్రాయపడ్డారు. తప్పు చేశామని తాము బాధపడటం లేదని.. సినిమా పరాజయాన్ని ఎవరి మీదా వేయకుండా తమ బాధ్యతగానే స్వీకరిస్తామని అనిల్ సుంకర స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్లానింగ్‌తోనే సినిమాకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగనీయమని.. తమపై నమ్మకం వుంచిన ప్రతి ఒక్కరినీ అనిల్ క్షమాపణలు కోరారు.

సురేందర్ రెడ్డిని పల్లెత్తు మాట అనని అనిల్ :

అయితే ఏజెంట్ ఫ్లాప్ విషయంలో అందరి వేళ్లూ దర్శకుడు సురేందర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ను ఆయన పెంచేశారని.. కథను, స్క్రిన్‌ప్లేను సరిగా డీల్ చేయలేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ సురేందర్ రెడ్డిని అనిల్ సుంకర వెనుకేసుకునే వచ్చారు. అంతేందుకు చివరి రోజు కానీ, విడుదలకు కొన్ని గంటల ముందు కానీ ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అనలేదు. కాగా.. ఏజెంట్ సినిమా మీద అనిల్ సుంకరకు దాదాపు 20 కోట్లు నష్టం వాటిల్లినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.