close
Choose your channels

'పులి' ఆడియో విడుదల

Thursday, September 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇళయ దళపతి విజయ్‌ హీరోగా, శృతిహాసన్‌, హన్సిక హీరోయిన్స్‌గా అందాల తార శ్రీదేవి ప్రధాన పాత్రలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై సిబు థమీన్స్‌ - పి.టి. సెల్వకుమార్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన ఫాంటసీ అడ్వంచరస్‌ చిత్రం 'పులి'. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌. మీడియా ప్రై. లి. అధినేత్రి సి. శోభ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంచలన సంగీత కెరటం రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ని అందించారు.

ఇటీవల తమిళంలో విడుదలైన ఆడియో సూపర్‌హిట్‌గా నిలిచి శ్రోతలను అలరిస్తోంది. కాగా తెలుగుకు సంబంధించిన ఆడియోని సెప్టెంబర్‌ 23న హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో చిత్ర ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్‌, దిల్‌ రాజు, టి. ప్రసన్నకుమార్‌, బి.ఎ. రాజు, 'శ్రీమంతుడు' ఫేం కొరటాల శివ, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ పాల్గొనగా నిర్మాత సి. శోభ ఫ్లవర్‌ బొకేలతో స్వాగతం పలికారు.

'పులి' ట్రైలర్‌ని సి.కళ్యాణ్‌ రిలీజ్‌ చేయగా దిల్‌ రాజు 'పులి' లోని స్పెషల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. కొరటాల శివ 'పులి' ప్రమోషనల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. 'పులి' బిగ్‌ సీడీని కొరటాల శివ లాంచ్‌ చేయగా అన్ని పాటలున్న 'పులి' ఆడియో సీడీని సి.కళ్యాణ్‌ రిలీజ్‌చేసి కొరటాల శివ, దేవిశ్రీప్రసాద్‌లకు అందించారు.

నిర్మాత సి. శోభ మాట్లాడుతూ - ''తుపాకి' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత విజయ్‌ గారి ప్రెస్టీజియస్‌ మూవీ 'పులి' చేయడం చాలా హ్యాపీగా ఉంది. 'పులి' ఫాంటసీ అడ్వంచరస్‌ మూవీ. గ్రాఫిక్‌ షాట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. కమల్‌కణ్ణన్‌ అద్భుతంగా సిజి వర్క్‌ చేశారు. ఈ చిత్రానికి శ్రీదేవి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. శృతిహాసన్‌, హన్సికల గ్లామర్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే సుదీప్‌ చాలా ముఖ్య పాత్రలో నటించారు. ఇట్‌ ఈజ్‌ ఎ వండర్‌ఫుల్‌ మూవీ. ఇంత మంచి మూవీని మాకు ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడు శింబుదేవన్‌కి థాంక్స్‌'' అన్నారు.
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ - ''ఎస్‌.వి.ఆర్‌. మీడియా బ్యానర్‌లో 'పులి' లాంటి ఫాంటసీ అడ్వంచరస్‌ మూవీని రిలీజ్‌ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి గొప్ప సంగీతాన్ని అందించారు. రీ రికార్డింగ్‌ అదిరిపోయింది. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పెద్ద కాస్టింగ్‌ ఉంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి శోభగారు ఇలాంటి చిత్రాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ - ''దేవిశ్రీప్రసాద్‌తో నా రిలేషన్‌ 'ఆర్య' నుండి కంటిన్యూగా సాగుతోంది. అతను చేసిన ఏ సినిమా ఆడియో రిలీజ్‌ అయినా సాంగ్స్‌ విని మొహమాటం లేకుండా ఏ ఏ పాటలు బాగున్నాయో చెప్తాను. ఎస్‌.వి.ఆర్‌. మీడియా శోభగారు 'పులి' చిత్రాన్ని రిలీజ్‌ చేయడం చాలా బాగుంది. ఆల్‌ ది బెస్ట్‌. విజయ్‌ నటించిన టు ఫిలింస్‌ తెలుగులో బాగా ఆడాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ కావాలి. శృతిహాసన్‌, హన్సిక, శ్రీదేవి, సుదీప్‌, పెద్ద స్టార్‌ కాస్టింగ్‌ ఉంది. ఏ భాషా చిత్రాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులకు నచ్చితే బాగా ఆదరిస్తారు. 'బాహుబలి', 'శ్రీమంతుడు', 'సినిమా చూపిస్త మావ' అన్నీ మంచి విజయాలు సాధించాయి. మా సినిమాతోపాటు ఇంకా వచ్చే సినిమాలు అన్నీ సక్సెస్‌ అయి తెలుగు పరిశ్రమ కళకళలాడాలి'' అన్నారు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ - ''ఫాంటసీ అడ్వంచరస్‌ సినిమాలు వచ్చి చాలా కాలం అయింది. ఇలాంటి సినిమాలు చిన్న పిల్లల దగ్గర్నుండి పెద్దవారి వరకు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఎస్‌.వి.ఆర్‌. మీడియా బ్యానర్‌లో వస్తున్న 'పులి' చిత్రం కూడా అందరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను. సాంగ్స్‌ అన్నీ చాలా బాగున్నాయి. ట్రైలర్‌ అమేజింగ్‌గా ఉంది. శ్రీదేవి, శృతిహాసన్‌, హన్సికల గ్లామర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. దేవిశ్రీప్రసాద్‌ మంచి ఆల్బమ్‌ ఇచ్చాడు. ఇలాంటి ఫిలింస్‌కి ఆడియో చాలా ఇంపార్టెంట్‌. దేవి సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఎస్‌.వి.ఆర్‌.లో 'పులి' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావాలి'' అన్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ - ''పులి'లాంటి ఫాంటసీ అడ్వంచర్‌ ఫిలింస్‌ తమిళ్‌, తెలుగు హిందీ భాషల్లో రావడం చాలా కరెక్ట్‌ అని నా ఒపీనియన్‌. అత్యంత భారీ బడ్జెట్‌లో సెల్వకుమార్‌, ధమీన్స్‌లు నిర్మించారు. చింబుదేవన్‌ విజన్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. కథ విని చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఈ చిత్రానికి మ్యూజిక్‌ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇంత మంచి సినిమాని శోభగారు చేయడం చాలా హ్యాపీగా వుంది. ఒక టెక్నీషియన్‌గా ఈ సినిమా ప్రమోషన్‌కి రావడం నా బాధ్యతగా ఫీలవుతున్నాను. విజువల్‌గా చాలా గ్రాండియర్‌గా ఈ సినిమా వుంటుంది. అందరూ ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమాని శింబుదేవన్‌ చాలా కష్టపడి చేశారు. 'పులి' చాలా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో 3 పాటలు రాశాను. క్వాలిటీ కోసం దేవి ఎంతైనా కష్టపడ్డాడు. అలాగే అతనికి సక్సెస్‌లు వస్తున్నాయి. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి శోభగారు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.