close
Choose your channels

'చంద్రిక' స్క్రీన్‌ప్లే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది : స్టోరి అండ్‌ స్క్రీన్‌ప్లే రైటర్‌ 'సాజిద్‌ ఖురేషి'

Thursday, September 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెలుగు -కన్నడ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం చంద్రిక` కోసం డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేను అనుసరించామని.. ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనవుతారనే నమ్మకం తమకుందని అంటున్నారు.. ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే సమకూర్చిన యువ ప్రతిభాశాలి సాజిద్‌ ఖురేషి. ఇంతకుముందు పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌` చిత్రానికి దర్శకత్వం వహించి.. తన ప్రతిభను ఘనంగా ప్రకటించుకొన్న సాజిద్‌ ఖురేషి.. తాజాగా నిషా కొఠారి టైటిల్‌ పాత్రలో రూపొందుతున్న బుల్లెట్‌రాణి` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

బిజినెస్‌పరంగా మంచి క్రేజ్‌ తెచ్చుకోవడంతోపాటు.. ప్రేక్షకుల దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తున్న చంద్రిక` గురించి.. స్టోరి అండ్ స్క్రీన్ ప్లే రైటర్‌ సాజిద్‌ ఖురేష` మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న యోగేష్‌.. చంద్రిక` చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా మలిచాడని.. దర్శకుడిగా అతనికి ఉజ్వలమైన భవిష్యత్‌ ఉందని సాజిద్‌ అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం నిర్మాతలు చేస్తున్న ప్రచారం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని ఖురేషి చెప్పారు.

నిర్మాణపరంగా ఏ విషయంలోనూ రాజీ పడనప్పుడే.. సినిమా పట్ల నిర్మాతకు గల ప్యాషన్‌ను తాను గ్రహించానని ఆయన అన్నారు. చంద్రికలు`గా నటించిన కామ్నజెత్మలాని-శ్రీముఖిలతోపాటు.. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న ప్రముఖ కన్నడ కథానాయకుడు జయరామ్‌ కార్తీక్‌కు చాలా మంచి పేరు వస్తుందని సాజిద్‌ ఖురేషి పేర్కొన్నారు. గున్వంత్‌ సమకూర్చిన సంగీతం మరియు రీ`రికార్డింగ్‌ చంద్రిక` చిత్రానికి ప్రధాన ఆకర్షణలు గా నిలుస్తాయన్నారు.

నిషా కొఠారి టైటిల్‌ పాత్రలో తను దర్శకత్వం వహిస్తున్న బుల్లెట్‌రాణి` కూడా తెలుగు `కన్నడ భాషల్లో ఏకకాంలో రూపొందుతోందని.. అక్టోబర్‌ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని.. బుల్లెట్‌రాణి` అనంతరం తెలుగులో మరో భారీ బడ్జెట్‌ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నానని బహుముఖ ప్రతిభాశాలి సాజిద్‌ ఖురేషి తెలిపారు!!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.