close
Choose your channels

ఫ్యామిలీ సీన్స్‌కు రెడీ అవుతున్న చ‌ర‌ణ్‌

Tuesday, June 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫ్యామిలీ సీన్స్‌కు రెడీ అవుతున్న చ‌ర‌ణ్‌

'రంగ‌స్థ‌లం' ఘ‌న‌విజ‌యం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారాయ‌న‌. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.

ఈ నెల 14 నుంచి హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో క‌థానాయ‌కుడు రామ్ చ‌ర‌ణ్‌, క‌థానాయిక కియారా అద్వానీతో పాటు ఇత‌ర ముఖ్య తారాగ‌ణం పాల్గొన‌గా ఫ్యామిలీ సీన్స్‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప‌దిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

వివేక్ ఒబెరాయ్‌, స్నేహ‌, ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, అన‌న్య త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందింస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశముంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.