close
Choose your channels

బిచ్చగాడు పై రానా చిన్న చూపు..

Saturday, June 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజ‌య్ ఆంటోని హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం పిచ్చైక్కార‌న్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నార‌ట‌.హీరో రానా ని క‌లిసి పిచ్చైక్కార‌న్ సినిమా చూపించార‌ట‌. అయితే సినిమా చూసి రానా క‌థ ఇంట్ర‌స్టింగ్ గా బాగానే ఉంది కానీ ఈ క‌థ ఇక్క‌డ వ‌ర్క‌వుట్ అవ్వ‌దు అని చెప్పాడ‌ట‌. రానా అలా చెప్ప‌డంతో రీమేక్ ఆలోచ‌న‌ల‌ను విర‌మించుకుని డ‌బ్బింగ్ రైట్స్ అమ్మేసార‌ట‌.
అదే బిచ్చ‌గాడు టైటిల్ తో రిలీజై ఇప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ డ‌బ్బింగ్ సినిమా స్ట్రైయిట్ సినిమా స్ధాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ కలెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ...అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. రానా ఈ సినిమా చేసుంటే...ఏ స్ధాయి విజ‌యం సాధిస్తుంది అనేది ప‌క్క‌న పెడితే రానా కెరీర్లో ఖ‌చ్చితంగా ఓ డిఫ‌రెంట్ మూవీగా నిలిచిపోయేది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.